‘జీరో బడ్జెట్ గార్డెనింగ్ ’ గురించి మీకు తెలుసా?

by  |
‘జీరో బడ్జెట్ గార్డెనింగ్ ’ గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్‌: తారలంతా.. తమ మూవీ షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ, కరోనా మహమ్మారి వల్ల అందరూ ఇంటిపట్టునే ఉంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నారు. అంతేకాదు.. ఈ లాక్‌డౌన్ కాలాన్ని ఎంతో బాగా వినియోగించుకుంటున్నారు. అక్కినేని సమంతా..టెర్రస్ గార్డెనింగ్, ఫేస్ థెరపీ, యోగా అంటూ కొవిడ్ కష్టకాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో టెర్రస్ ఫార్మింగ్ (మిద్దె తోట వ్యవసాయం) చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికే చాలా మంది తమ ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను టెర్రస్ ఫార్మింగ్ చేస్తూ సమకూర్చుకుంటున్నారు. సమంత కూడా ఇటీవలే టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. వాటికి సంబంధించిన ఫొటోలతో పాటు వ్యవసాయ సూత్రాలను కూడా షేర్ చేసింది. అయితే, ఆమె టెర్రస్ గార్డెనింగ్‌కు అసలు డబ్బులు ఏమీ ఖర్చు చేయకుండానే ఎలా చేసుకోవాలో తెలియజేస్తోంది. ఇందుకోసం ఆమె యాంకర్ అవతారం ఎత్తింది.

‘మనకు కావాల్సిన ఆహారాన్ని మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచనతో నేను స్వయంగా అర్బన్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నానని’ ఇటీవలే సమంత చెప్పింది. అందరూ ఇలా ఇంట్లోనే కూరగాయాలను పండించుకుంటే..ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులు కూడా సేవ్ చేయొచ్చని సామ్ చెబుతోంది. ఇందుకోసం తానే స్వయంగా అర్బన్ ఫార్మింగ్ చేస్తున్న ప్రముఖులను, నిపుణులను ఇంటర్వూ చేయడానికి నిర్ణయించుకుంది. తొలిగా ‘జీరో బడ్జెట్ గార్డెనింగ్’ – ఎలా? ఎందుకు?’ అనే పేరుతో భార్గవి అనే అర్బన్ ఫార్మర్‌ని ఇంటర్వ్యూ చేసింది. అర్బన్ ఫార్మింగ్ జర్నీ ఎలా మొదలైంది? మొదట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటీ? అర్బన్ ఫార్మింగ్‌లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వంటి ప్రశ్నలను సామ్ భార్గవిని అడిగింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ షేర్ చేసింది. అంతేకాదు.. నాతో పాటు మీరు ఎదగండి అంటూ.. ‘గ్రో విత్ మీ ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సామ్ యాడ్ చేసింది.

Next Story

Most Viewed