Instagram లో చైతు ఫొటోలు డిలీట్ చేసిన Samantha

by  |
Samantha, Naga Chaitanya
X

దిశ, సినిమా: చైతు-సమంత విడాకుల మ్యాటర్ కాస్త చల్లబడిపోయింది. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తుండగా.. సామ్ అధ్యాత్మిక యాత్రల్లో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అప్‌డేట్ ఇస్తోంది. మొత్తానికి ఈ బాధ నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మిక చింతనను ఆశ్రయించిన సామ్.. కాస్త స్ట్రాంగ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక చైతన్యను తన లైఫ్‌లో నుంచి కంప్లీట్‌గా డిలీట్ చేశాననే మెసేజ్ ఇస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చైతుకు సంబంధించిన అన్ని ఫొటోలను డిలీట్ చేసేసింది. ఇక తనతో సంబంధం లేదని కన్‌ఫర్మ్ చేసేసింది. నార్మల్‌గా ఇద్దరున్న ఫొటోస్ మాత్రమే కాదు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పెట్ డాగ్స్‌తో ఉన్న గ్రూప్ ఫొటోలను కూడా తన అకౌంట్ నుంచి డిలీట్ చేసేసి.. గతానికి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.


Next Story