'జాను' పై అభిమానానికి ధన్యవాదాలు

by  |
జాను పై అభిమానానికి ధన్యవాదాలు
X

‘జాను’ సినిమాలో తన నటనకు అందుతున్న ప్రశంసలపై అక్కినేని కోడలు సమంత స్పందించారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమా..తమిళ మూవీ ’96’ ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయినా సరే సినిమాలో సామ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. విమర్శకులు సైతం సామ్ యాక్టింగ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన సమంత..బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా.. ‘జాను’ సినిమా తనలో చాలా మార్పును తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో వేదికగా తెలిపింది. ఈ సినిమా ద్వారా నా కళకు మరింత ప్రాధాన్యతనివ్వడం నేర్చుకున్నానని చెప్పింది. ఈ విషయంలో జాను సినిమా నాకు ఎప్పుడూ గొప్పగానే కనిపిస్తుందన్న సామ్..మీరు నాపై కురిపించిన ప్రశంసలకు, అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నట్లు తెలిపింది. కాగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన జాను సినిమాకు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు.

Next Story

Most Viewed