సామ్ డిజిటల్ ఎంట్రీ అదిరినట్లే..

by  |
సామ్ డిజిటల్ ఎంట్రీ అదిరినట్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సక్సెస్ తర్వాత వస్తున్న సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా జాయిన్ కావడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సిరీస్ ద్వారానే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుండగా.. ఇప్పటికే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేసింది. ఇక సిరీస్ షూటింగ్ కూడా పూర్తిగా అయిపోగా.. ఇందులో సామ్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. సిరీస్‌లో తనది నెగెటివ్ క్యారెక్టర్ అన్న విషయం ఇప్పటికే లీక్ కాగా, సిరీస్‌లో తను పాకిస్తానీ టెర్రరిస్ట్‌గా కనిపించబోతుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే సామ్ కెరియర్‌లో సూపర్ కిక్ ఇచ్చే రోల్ మరొకటి యాడ్ అయినట్లే అని, మరిన్ని పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్స్ బాలీవుడ్ నుంచి కూడా వచ్చేసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు.

కాగా సామ్.. ప్రస్తుతం మూవీలతో పాటు గార్డెనింగ్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ టిప్స్ ఇవ్వడంలో బిజీగా ఉంది. దీంతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సాకి’ క్లాతింగ్ బ్రాండ్‌ను ఈ నెల 28న రిలీజ్ చేసే పనిలో ఉంది.

Next Story

Most Viewed