సక్సెస్ సెలబ్రేషన్స్ లో సామ్-చై.. అన్నింటికి సమాధానం చెప్తానంటున్న అక్కినేని కోడలు

by  |
సక్సెస్ సెలబ్రేషన్స్ లో సామ్-చై.. అన్నింటికి సమాధానం చెప్తానంటున్న అక్కినేని కోడలు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని సమంత పట్టరాని సంతోషంలో ఉంది. ఈ సంతోషంలోనే అభిమానులతో ముచ్చటించనుంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య- సమంత విడాకుల రూమర్లు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పుకార్లపై అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పింది లేదు.. ఇక మరోవైపు సామ్ కూడా సమయం వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంటూ మాట దాటేసింది. ఇక ఈ జంట ప్రస్తుతం ఈ రూమర్లను పక్కనపెట్టి ఎవరిపనులలో వారు బిజీగా మారారు, చైతూ ‘లవ్ స్టోరీ’ విడుదలై సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో చై ఉన్నాడు. ఇటుపక్క సామ్ ఏడాది క్రితం బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

సాకీ పేరుతో మొదలైన ఈ బ్రాండ్ మొదలై నేటికి ఏడాది పూర్తవుతుంది. ఇక ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ లో సామ్ పాల్గొంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 5 గంటలకు సమంత ఆన్‌లైన్‌లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఉదయం 11 గంటలకు ‘వన్‌ విత్‌ సాకీ’ ని సమంత ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో అడగండి అంటూ ఓ పోస్ట్‌ చేసింది. ఇక ఎప్పటినుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. ఇప్పటివరకు వారి మనస్సులో నెలకొన్న అనుమానాలను అన్ని సామ్ ముందు ఏకరువు పెట్టడానికి రెడీ ఐపోతున్నారు. మరి అభిమానుల ప్రశ్నలకు అక్కినేని కోడలు తడబడకుండా నిజం చెప్తుందా..? లేక తెలివిగా తప్పించుకొంటుందా..? అనేది చూడాలి.

Next Story

Most Viewed