‘అంతిమ్’‌కు నిరసన సెగ.. ‘బాయ్‌కాట్ బాలీవుడ్ బ్లడీ క్రిమినల్స్’ అంటూ..

by  |
antim
X

దిశ, సినిమా: మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్ శర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంతిమ్‌:ది ఫైనల్ ట్రూత్’. శుక్రవారం విడుదలైన సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్‌‌కాట్ అంతిమ్’ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికోస్తే.. గతేడాది జూన్ 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ డెత్ కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న నెటిజన్లు.. విమర్శలు గుప్పిస్తున్నారు.

బాలీవుడ్ మాఫియా, డ్రగ్స్ కుంభకోణాల బారిన పడి తను మరణించాడని అందులో స్టార్లందరూ భాగమేనంటున్నారు. సుశాంత్ చనిపోయిన రోజునే బాలీవుడ్‌ను వదిలేశామని, SK అనే పేరు ISI, దావూద్, డ్రగ్స్, హత్యలు, హిందూ దేవుళ్లను అపహాస్యం చేయడం, అవమానించడం వంటి వాటికి కేంద్రంగా ఉందంటున్నారు. ‘బాయ్‌కాట్ బాలీవుడ్ బ్లడీ క్రిమినల్స్. మేమే మిమ్మల్ని స్టార్స్‌ను చేశాం. ఇప్పుడు బహిష్కరిస్తున్నాం’ అంటూ ఫైర్ అవుతున్నారు.

Next Story