సల్లూ భాయ్ .. రోజుకు రూ. 7 కోట్లా?

by  |
సల్లూ భాయ్ .. రోజుకు రూ. 7 కోట్లా?
X

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిందీ చిత్ర సీమలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన సల్మాన్.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ యాడ్ షూటింగ్ కోసం రోజుకు రూ. 7కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

చైనీస్ స్మార్ట్ ఫోన్ యాడ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సల్మాన్‌ అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోన్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడట. ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు షూటింగ్ జరగనుండగా… సల్మాన్‌కు రోజుకు రూ. 7 కోట్లు చెల్లిస్తోందట సంస్థ. దీంతో సల్లూ భాయ్ లెవలే వేరప్పా అంటున్నారు ఫ్యాన్స్.

కాగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధే – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి’ మే 22న విడుదల కానుంది. తర్వాత ‘కభి ఈద్ కభి దివాళి’ సినిమాను 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సల్లూ భాయ్.

Tags : Salman Khan, Bollywood, Ad Shooting, Radhe



Next Story

Most Viewed