గుట్కా.. అమ్మకాలతో మస్కా!

by  |
గుట్కా.. అమ్మకాలతో మస్కా!
X

దిశ, నిజామాబాద్: కరోనా నివారణకు లాక్‌డౌన్ విధించడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడి ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఒక్క నిత్యావసరాలు తప్ప కొనుగోళ్లు, అమ్మకాలు మొత్తం నిలిచిపోయాయి. కానీ, పొగాకు ఉత్పత్తులు మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక గుట్కాను రూ.25కు అమ్ముతుండగా అంబర్ రూ.50, ఖైనీ రూ.40 వరకు విక్రయిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సందర్భంగా సిగరేట్ పరిశ్రమలన్నీ మూతపడినా అంతకు ముందే
తెచ్చిన స్టాక్‌‌కు విపరీతంగా ధరలు పెంచేసి అమ్ముతున్నారు. స్టేట్‌లో మద్యం విక్రయాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని భావిస్తున్న దుకాణాదారులు ధరలు రెండుమూడింతలు పెంచి దొంగచాటుగా అమ్మకం చేపడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేసినప్పటికీ కొత్తదారులు వెతుకున్న స్మగ్లర్లు గాడిదలపై అక్రమ రవాణా చేస్తూ రాష్ట్రంలోకి గుట్కా ప్యాకెట్లను తీసుకువస్తున్నారు.

ఆంక్షలు అతిక్రమించి…

తెలంగాణ ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల తయారీని నిషేధించి.. గుట్కా, అంబర్, జర్దా, ఖైనీలు రవాణాపై ఆంక్షలు విధించినా కొందరు దొంగచాటుగా అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. అంతేగాక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసినా పట్టించుకోకుండా మార్నింగ్ టైంలో నిత్యావసరాలకు బయటకు వచ్చిన సమయంలో గుట్కాలు తిని రోడ్డుపైనే ఉమ్మి వేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో టెన్షన్ పడిపోతున్న ప్రజలు బయట ఉమ్మివేస్తున్న వారితో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.

tags: Corona Virus, Lockdown, Gutka Packets, Tobacco Products, Maharashtra,
Karnataka, Import, Donkeys, Cancer


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed