నిమ్మగడ్డ బరితెగించి వ్యవహరిస్తున్నారు: సజ్జల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బరి తెగించి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదో జరిగిపోతుందని నిమ్మగడ్డ అధికారులను బెదిరించడం సరికాదన్నారు. సర్వాధికారులు తనకే ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోఏకగ్రీవాలు హోల్డ్‌లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరగడం ఏ రకంగా నేరమవుతుందో చెప్పాలన్న సజ్జల.. సలహాలు, సూచనలు తప్ప ఆంక్షలు విధించే అధికారం నిమ్మగడ్డకు లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకొని [&hellip;]</p>

నిమ్మగడ్డ బరితెగించి వ్యవహరిస్తున్నారు: సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బరి తెగించి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదో జరిగిపోతుందని నిమ్మగడ్డ అధికారులను బెదిరించడం సరికాదన్నారు. సర్వాధికారులు తనకే ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోఏకగ్రీవాలు హోల్డ్‌లో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరగడం ఏ రకంగా నేరమవుతుందో చెప్పాలన్న సజ్జల.. సలహాలు, సూచనలు తప్ప ఆంక్షలు విధించే అధికారం నిమ్మగడ్డకు లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.

Next Story