హృతిక్‌తో డ్యాన్స్‌ అంటే.. సినిమా నుంచే తప్పుకుంటా : Saif Ali Khan

by Shyam |   (  Updated:2021-09-04 07:56:52  IST  )

<p>దిశ, సినిమా : తమిళ్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్.. కోస్టార్ హృతిక్ రోషన్‌పై ప్రశంసలు కురిపించాడు. పంతొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. 2002లో ‘నా తుమ్ జానో నా హమ్’ సినిమాలో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమాలో తనది చాలా చిన్న రోల్ అని లేటెస్ట్ ఇంటర్య్యూలో గుర్తుచేసుకున్న సైఫ్.. ప్రస్తుతం ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్‌తో కలిసి పనిచేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు [&hellip;]</p>

హృతిక్‌తో డ్యాన్స్‌ అంటే.. సినిమా నుంచే తప్పుకుంటా : Saif Ali Khan
X

దిశ, సినిమా : తమిళ్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్.. కోస్టార్ హృతిక్ రోషన్‌పై ప్రశంసలు కురిపించాడు. పంతొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. 2002లో ‘నా తుమ్ జానో నా హమ్’ సినిమాలో ఫస్ట్ టైమ్ కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమాలో తనది చాలా చిన్న రోల్ అని లేటెస్ట్ ఇంటర్య్యూలో గుర్తుచేసుకున్న సైఫ్.. ప్రస్తుతం ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్‌తో కలిసి పనిచేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపాడు.

ఇక హృతిక్‌ను ఫినామినల్ యాక్టర్, డ్యాన్సర్‌గా పేర్కొన్న సైఫ్.. తనతో పోటీపడి నటించాలంటే కష్టపడాల్సిందే అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘భూత్ పోలీస్’ కోస్టార్ అర్జున్ కపూర్.. సైఫ్ డ్యాన్సింగ్ స్కిల్స్‌‌ను హృతిక్‌తో కంపేర్ చేసి జోక్ చేశాడు. అది నిజమేనని ఒప్పుకున్న సైఫ్.. డ్యాన్స్ విషయమే తీసుకుంటే ఈ సినిమా చేయకపోయేవాడినని తెలిపాడు.

Saif Ali Khan says he wouldn’t have done Vikram Vedha remake if he had to dance with Hrithik Roshan

Next Story