సపోర్టింగ్ యాక్టర్‌ సరసన సాయి పల్లవి ?

by  |
సపోర్టింగ్ యాక్టర్‌ సరసన సాయి పల్లవి ?
X

దిశ, సినిమా: రౌడీ బేబి సాయి పల్లవి 2021లో బిజీ షెడ్యూల్స్‌తో గడపనుంది. తెలుగులో మలార్ బ్యూటి నటించిన ‘లవ్ స్టోరి’ ‘విరాటపర్వం’ సినిమాలు సమ్మర్‌లో 15 రోజుల గ్యాప్‌లో రిలీజ్ కానుండగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘వెన్నెల’ పవన్ కళ్యాణ్ – రానా స్టారర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, చిరు ‘వేదాళం’ రీమేక్‌తో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేసిందని టాక్. దీంతో పాటు తమిళ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌ల పరిశీలనలో ఉన్న సాయి పల్లవి లేటెస్ట్‌‌గా ఓ కోలీవుడ్ చిత్రంలో సపోర్టింగ్ యాక్టర్‌ కాళి వెంకట్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధం అయిపోయిందని సమాచారం. ‘తడియెరి థాకా’ ‘తెగిది’ ‘ఇరుద్ది సుత్రు’ ‘సురారై పోట్రు’ సినిమాల్లో కీలక పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పుపొందిన కాళి వెంకట్‌..సాయి పల్లవితో జతకట్టబోతున్నాడని తెలుస్తోంది. కాగా, ఎప్పటిలాగే గ్లామర్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వని రౌడీ బేబి.. తనది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ కావడం వల్లే ఇంత సాహసం చేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.


Next Story

Most Viewed