సుకుమార్ స్క్రీన్ ప్లేలో సుప్రీం హీరో

72

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ 15వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాకు కార్తీక్ దండు డైరెక్టర్ కాగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవుడి పటాలపై తేజ్ క్లాప్ ఇవ్వగా.. సుకుమార్ పిల్లలు సుకృతి వేణి, సుక్రాంత్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత బీవీఎస్‌‌ఎన్‌ ప్రసాద్‌ డైరెక్టర్‌కు స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన నటీనటుల పేర్లు వెల్లడిస్తామని తెలిపారు మేకర్స్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..