చరణ్ సాయిదాస్‌కు ‘గాంధీజీ సాహిత్య రత్న’

349

దిశ,సిద్దిపేట: మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సాహితీ విభాగం హైదరాబాద్ వారు సంయుక్తంగా గాంధీజీ విశ్వకవి సమ్మేళనము-2020ను నిర్వహించారు. శ్రీ వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్‌కు ఆయన చేసిన సాహిత్య సేవలకు గాను ఈ కార్యక్రమంలో గాంధీజీ సాహిత్య రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి , చైర్మన్ శ్రీ గున్న రాజేందర్ రెడ్డి విజయలక్ష్మి, శ్రీ యానాల ప్రభాకర రెడ్డి, శ్రీ కల్యాన్ కార్ గోపాల్ జీ ,శ్రీ యం.రామాంజనేయులు ప్రముఖులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..