డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘సడక్ 2’

by  |
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘సడక్ 2’
X

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సడక్ 2’. తొలిసారి తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో అలియా నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ సినిమాకు ఇది సీక్వెల్ కాగా.. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అలియా, ఆదిత్య, సంజయ్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇప్పటికే ముగ్గురి ఫస్ట్ లుక్‌కు మంచి మార్కులు పడగా.. సడక్ 2 ట్రైలర్ మంగళవారం( ఆగస్ట్ 11) రిలీజ్ కానుంది.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌లో రిలీజ్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించిన టీమ్.. సూపర్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్‌కు సిద్ధంగా ఉండండని చెబుతోంది.

కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో మహేష్ భట్‌పై ఆగ్రహంగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే మూవీ టీమ్ సోషల్ మీడియాలో కామెంట్స్ లిమిటెడ్ చేసి, నెగెటివ్ టాక్ రాకుండా జాగ్రత్త పడింది.



Next Story

Most Viewed