- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడోబా అభయారణ్యంను సందర్శించిన సచిన్ దంపతులు
<p>దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యంలో బుధవారం ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దంపతులు పర్యటించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర చంద్రాపూర్ లో గల అభయారణ్యాన్ని క్రికెట్ దిగ్గజం టెండూల్కర్, ఆయన భార్య అంజలి సందర్శించారు. అభయారణ్యంలోని ప్రత్యేక వాహనంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అడవి జంతువులు, అడవి అందాలను తిలకించారు. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర, అదిలాబాద్‌కు చెందిన క్రికెట్ అభిమానులు తరలివెళ్లి సచిన్ టెండూల్కర్ తో సెల్ఫీలు దిగుతూ […]</p>

X
దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యంలో బుధవారం ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దంపతులు పర్యటించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర చంద్రాపూర్ లో గల అభయారణ్యాన్ని క్రికెట్ దిగ్గజం టెండూల్కర్, ఆయన భార్య అంజలి సందర్శించారు. అభయారణ్యంలోని ప్రత్యేక వాహనంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అడవి జంతువులు, అడవి అందాలను తిలకించారు. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర, అదిలాబాద్‌కు చెందిన క్రికెట్ అభిమానులు తరలివెళ్లి సచిన్ టెండూల్కర్ తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కాగా, ఇప్పటికే తాడోబా అభయారణ్యంను రెండుసార్లు సచిన్ సందర్శించినట్లు అధికారులు తెలిపారు.
- Tags
- maharastha
Next Story






