మోడలింగ్‌లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. వీడియో వైరల్ 

by  |
మోడలింగ్‌లో అదరగొడుతున్న సచిన్ కూతురు.. వీడియో వైరల్ 
X

దిశ, సినిమా: ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా తనకంటూ సొంత గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం ప్రారంభించింది. ఈ క్రమంలో తనకు చాలా ఇష్టమైన మోడలింగ్‌ రంగంలో‌కి అడుగుపెట్టిన సారా.. ప్రస్తుతం ఓ క్లాతింగ్ బ్రాండ్‌కు మోడల్‌గా వ్యవహరించడం విశేషం. కాగా తాజాగా తను మోడలింగ్ చేస్తున్నట్లు అభిమానులకు తెలిపేందుకు ఓ వీడియోను షేర్ చేసిన సారా.. ఇందులో సినీ నటి బనితా సంధు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైదేవ్ ష్రాఫ్ కుమార్తె తానియా ష్రాఫ్‌తో కలిసి పోజులిచ్చింది.

కాగా సారా వీరిద్దరితో కలిసి ‘అజియోలుక్స్‌’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. షార్ట్ స్కర్ట్‌లో సూపర్ కూల్‌గా కనిపించిన సారాను చూసిన సచిన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో రిలేషన్‌‌లో ఉందంటూ చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా గిల్‌‌తో బ్రేకప్‌కు సంబంధించి కోట్స్‌ షేర్‌ చేయడంతో రూమర్స్‌కు చెక్‌ పడింది. ప్రస్తుతం సింగర్‌ కనికా కపూర్‌తో సారా నైట్‌డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసి మరోసారి వార్తల్లోకెక్కింది.

హాట్ ఫోజులో నటి.. అక్కడ సైజ్ పెరిగిందంటూ నెటిజన్ల ట్రోల్స్



Next Story