సచిన్‌కు డబుల్ సెంచరీలు చేయడం తెలియదు : కపిల్

102

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కలిగిన సచిన్ టెండుల్కర్‌కు సెంచరీలు చేయడం తప్ప డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేయడం తెలియదని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. సచిన్ తన కెరీర్‌లో మరిన్ని డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించి ఉంటే బాగుండేదని కపిల్ అభిప్రాయపడ్డారు.

టీం ఇండియా మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ మాట్లాడుతూ.. ‘సచిన్‌లో చాలా ప్రతిభ ఉంది. క్రికెట్ చరిత్రలో అలాంటి క్రికెటర్ లేడు. సెంచరీలు ఎలా చేయాలో సచిన్‌కు బాగా తెలుసు. కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో మాత్రం తెలియదు. సెంచరీ చేసిన తర్వాత సచిన్ పరుగుల వేగం పెంచడు. కేవలం సింగిల్స్ తీస్తుంటాడు. దాంతో అతడు సెంచరీలు దాటి పరుగులు చేయలేదు’ అని కపిల్ విశ్లేషించాడు.

సచిన్ కెరీర్‌లో కనీసం 5 ట్రిపుల్ సెంచరీలు, 10 డబుల్ సెంచరీలు చేయాల్సిందని, సెంచరీ వరకు ప్రతీ ఓవర్‌కు ఒక బౌండరీ బాదే సచిన్ తర్వాత నెమ్మదిగా ఆడటం వల్లే ఆ ఘనతను అందుకోలేకపోయాడని కపిల్ అన్నాడు. సచిన్ ఖాతాలో 51 టెస్టు సెంచరీలు ఉండగా.. వాటిలో ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. డబుల్ సెంచరీల రికార్డులు సచిన్‌ది 12వ స్థానం. కాగా వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ సచినే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..