- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వసీం అక్రమ్‌పై టీం ఇండియా అభిమానులు ఫైర్
<p>దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్‌పై టీం ఇండియా అభిమానులు.. ముఖ్యంగా సచిన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టెస్టుల్లో అద్భుత రికార్డు కలిగిన సచిన్‌ను కించపరిచాడంటూ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయమని మాజీ ఆటగాడు బసిత్ అలీ కోరాడు. దీంతో అక్రమ్ ఐదుగురి పేర్లను ప్రకటించి.. వారికి ర్యాంకింగ్స్ ఇచ్చాడు. విండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌కు తొలి ర్యాంకు, న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ […]</p>

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్‌పై టీం ఇండియా అభిమానులు.. ముఖ్యంగా సచిన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టెస్టుల్లో అద్భుత రికార్డు కలిగిన సచిన్‌ను కించపరిచాడంటూ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయమని మాజీ ఆటగాడు బసిత్ అలీ కోరాడు. దీంతో అక్రమ్ ఐదుగురి పేర్లను ప్రకటించి.. వారికి ర్యాంకింగ్స్ ఇచ్చాడు. విండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌కు తొలి ర్యాంకు, న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోకు రెండో ర్యాంకు, లెజండరీ క్రికెటర్ బ్రియన్ లారాకు మూడో ర్యాంకు, పాకిస్తాన్ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్‌కు నాలుగో ర్యాంకు, సచిన్ టెండుల్కర్‌కు ఐదో ర్యాంకు ఇచ్చాడు. ఇక్కడే సచిన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. టెస్టులు, వన్డేల్లో కలిపి అత్యద్భుతమైన రికార్డు కల్గిన సచిన్‌కు కావాలనే చివరి ర్యాంకు ఇచ్చాడని అక్రమ్‌పై మండిపడుతున్నారు.






