- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేటి నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులకు అనుమతించారు. రెండు నెలలపాటు వార్షిక మండల, మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. అయితే రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే అనుమతించగా.. వారాంతాల్లో రెండు వేల మందికి అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. కాగా, భక్తులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైబడిన, పదేళ్ల లోపు వారికి దర్శనానికి అనుమతి లేదని ఆలయ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేటి నుంచి అయ్యప్ప దర్శనానికి భక్తులకు అనుమతించారు. రెండు నెలలపాటు వార్షిక మండల, మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. అయితే రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే అనుమతించగా.. వారాంతాల్లో రెండు వేల మందికి అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. కాగా, భక్తులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైబడిన, పదేళ్ల లోపు వారికి దర్శనానికి అనుమతి లేదని ఆలయ మండలి స్పష్టం చేసింది.
Next Story






