ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు… త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ గిఫ్ట్

by  |
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు… త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ గిఫ్ట్
X

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌలి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్ర ఆర్ ఆర్ ఆర్( రౌద్రం రణం రుథిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. వీరికి జంటగా హాలీవుడ్ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన అన్నిఅత్యంత గోప్యంగా ఉంచుతున్నారు దర్శకుడు రాజమౌలి. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా సీతారామరాజుగా చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. దీనికి తోడు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో వాయిస్ ఓవర్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో కానీ, ఫస్ట్ లుక్ కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో వారు అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

Next Story

Most Viewed