ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులపై కొరడా

44

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 6 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశారు.