వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

25

దిశ ,భువనగిరి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ నష్టం చేకూర్చాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా చెరువులు, వాగులు ఉప్పొంగి రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలి కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వలిగొండ బ్రిడ్జి వద్ద వరద నీటిలో 12 లారీలు, ఒక టాటా సుమో కొట్టుకుపోయాయి.

మరోవైపు పోచంపల్లి-కొత్తగూడెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో నుంచి దిగిన 35 మంది ప్రయాణికులు గట్టు మీదకు చేరారు. ప్రయాణికుల చుట్టూ నీరు ఉండటంతో అక్కడే చిక్కుకున్నారు. ప్రయాణికులను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.