- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజ్వేల్‌లో ఘోర ప్రమాదం.. బొలేరోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
by Batti.Sumithra |
<p>దిశ, గజ్వేల్ : ఆర్టీసీ బస్సు.. బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యాడ్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ములుగు ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డి తన భార్య పిల్లలతో కలిసి బోనాల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు […]</p>

X
దిశ, గజ్వేల్ : ఆర్టీసీ బస్సు.. బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యాడ్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.
ములుగు ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డి తన భార్య పిల్లలతో కలిసి బోనాల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీ కొట్టి డివైడర్‌ను దాటి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న నరసింహా రెడ్డి కుటుంబానికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
Next Story






