అక్కడ మేకపాలు లీటరు రూ.1500 – ఎందుకంటే?

212
goat-milk

దిశ, ఫీచర్స్ : ఏ వస్తువుకైనా మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందంటే, ఆటోమేటిక్‌గా రేటు పెరుగుతుంది. నిత్యావసరాల విషయంలో ఎక్కువగా ఈ పరిస్థితిని చూస్తుంటాం. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. డెంగ్యూ ఫీవర్ వల్ల ఆ రాష్ట్రంలోని ఓ జిల్లాలో వందలమంది చనిపోవడంతో మేక పాల ధరకు రెక్కలొచ్చాయి. ఈ పాలకు సాధారణంగా లీటరుకు రూ.50/- ఉంటుండగా.. ప్రస్తుతం రూ.1500/-కు పైగా విక్రయిస్తుండటం గమనార్హం.

ప్లేట్‌లెట్స్ పెరుగుతాయని..
మేక పాలు తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుందనే అపోహలు ప్రచారమవుతుండటంతో గిరాకీ అమాంతం పెరిగింది. కాగా ఈ పరిస్థితిని వివరించిన ఫిరోజాబాద్‌కు చెందిన ఓ పాల విక్రయదారుడు.. ‘గత నెల డెంగ్యూ వ్యాప్తి చెందినప్పటి నుంచి చాలామంది మేక పాల కోసం నా దగ్గరకు వస్తున్నారు. మొదట లీటరు రూ.50కే విక్రయించినా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో రూ.1500 తీసుకుంటున్నా’ అని తెలిపాడు. అయితే డెంగ్యూను తగ్గించడానికి మేకపాలు సాయపడతాయని స్థానిక ఆయుర్వేద డాక్టర్ సూచించాడని స్థానికులు చెబుతుండగా.. శాస్త్రీయంగా మాత్రం రుజువు కాలేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..