‘ఆర్‌ఆర్‌ఆర్’ అప్‌‌డేట్ ఏమై ఉంటుంది?

by  |
‘ఆర్‌ఆర్‌ఆర్’ అప్‌‌డేట్ ఏమై ఉంటుంది?
X

దిశ, వెబ్‌డెస్క్:
‘ఆర్‌ఆర్‌ఆర్’.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో కేవలం ఒకే ఒక్క అప్‌డేట్ వచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా తారక్ పుట్టినరోజున కూడా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వలేక పోయింది మూవీ యూనిట్. దీనిపై చాలా యుద్ధమే జరగ్గా, తారక్ మాటతో అభిమానులు ఆగ్రహాన్ని తగ్గించుకున్నారు.

ఇక కరోనా పరిస్ధితుల నడుమ సినిమా షూటింగ్ మళ్లీ ఎలా మొదలు పెడతారు? అనుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఇందుకు సంబందించిన అప్‌డేట్ న్యూస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ‘ఇక మా పండుగ పోస్ట్‌లు, అప్‌డేట్స్ కోసం మమ్మల్ని తిట్టడంలో మీ సృజనాత్మకత చాలు.. మీ ప్రేమతో బాంబు పేల్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపింది. టైమ్ గడిచిపోతుంది.. ఫైనల్‌గా మిమ్మల్ని అలరించే టైమ్ వచ్చేసింది. ఇప్పుడు మా వంతు అంటూ పోస్ట్ పెట్టింది ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.

అయితే అసలు మంగళవారం ఇచ్చే అప్‌‌డేట్ ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు అభిమానులు. ఇంతకీ రిలీజ్ చేయబోయేది భీమ్ ఫస్ట్ లుక్ టీజరే కదా! అని ప్రశ్నిస్తున్నారు.

https://twitter.com/RRRMovie/status/1313063888854814721?s=19

Next Story

Most Viewed