- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో RRR సినిమా.. కేసీఆర్‌కు చూపిస్తామన్న బండి సంజయ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈటల గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ చాలెంజ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం అయిపోయిందన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో అసెంబ్లీలో RRRలు తయారవుతారు అంటూ బండి సంజయ్ అభివర్ణించారు. రాజాసింగ్, రఘునందన్, […]</p>

X
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈటల గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ చాలెంజ్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం అయిపోయిందన్నారు. ఈటల రాజేందర్ గెలుపుతో అసెంబ్లీలో RRRలు తయారవుతారు అంటూ బండి సంజయ్ అభివర్ణించారు. రాజాసింగ్, రఘునందన్, రాజేందర్(RRR)లు కలిసి కేసీఆర్‌కు సినిమా చూపిస్తారంటూ చురకలు వేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ఎత్తి చూపుతారంటూనే.. బండి సంజయ్ ఉపఎన్నికలో ఈటల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.
Next Story






