మళ్లీ ఓడిన హైదరాబాద్.. ఆనందంలో ఆర్సీబీ

by  |
మళ్లీ ఓడిన హైదరాబాద్.. ఆనందంలో ఆర్సీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. SRH బౌలర్లు RCB బ్యాట్స్‌మాన్‌లకు 149 పరుగులకే కట్టడి చేసినప్పటకీ.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (54), మనీష్ పాండే (38) పరుగులతో రాణించిన మిగతా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. వృద్ధిమాన్ సాహా (1), బెయిర్ స్టో (12), అబ్దుల్ సమాద్ (0), విజయ్ శంకర్ (3), జాసన్ హోల్డర్ (4) వరుసగా వికెట్లు పారేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ కాస్తా దూకుడుగా ఆడినా.. 17 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ తర్వాత రెండు బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. షాబాజ్ నదీమ్ డకౌట్ అయ్యాడు. ఇక చివరి బంతికి భువనేశ్వర్ ఒక పరుగు మాత్రమే తీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు హైదరాబాద్ జట్టు 143/9 స్కోరును నమోదు చేసి మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే విరాట్ సేన 6 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది.

ఆర్సీబీ జట్టులో ముఖ్యంగా షాబాజ్ అహ్మద్ ఓకే ఓవర్‌లో 3 వికెట్లు తీసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇతడి ఓవర్‌లోనే బెయిర్ స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమద్ వంటి కీలక బ్యాట్స్‌మెన్లు క్యాచ్ అవుట్ అయ్యారు. దీంతో ఆర్సీబీ విజయం లాంఛనమైంది. ఇదే జట్టులో సిరాజ్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు తీసుకోగా.. జెమీసన్ 1 వికెట్ తీసుకున్నాడు.


Next Story

Most Viewed