‘రౌడీ బేబి’ న్యూ అచీవ్‌మెంట్

by  |
‘రౌడీ బేబి’ న్యూ అచీవ్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్‌స్టార్ ధనుష్, బ్యూటిఫుల్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘మారి 2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రౌడీ బేబి సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే కొనసాగుతుండటం విశేషం. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా.. తాజాగా ‘రౌడీ బేబి’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ బిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. వన్ బిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంగ్ ఇదే కాగా.. దీనిపై హీరో ధనుష్ ట్వీట్ చేశారు. వాట్ ఏ స్వీట్ కో-ఇన్సిడెన్స్.. ‘కొలవెరి డీ’ తొమ్మిదో వార్షికోత్సవం రోజునే ‘రౌడీ బేబి’ సాంగ్ ఈ రికార్డు సృష్టించిందన్నారు. దీనిని గౌరవంగా భావిస్తున్నామన్న ధనుష్.. ‘మారి 2’ టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed