కెప్టెన్‌గా రోహిత్ ఫిక్స్.. వైస్ కెప్టెన్ రేస్‌లో ఆ ఇద్దరే

by  |

దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్స్‌గా విరాట్​ కోహ్లీని పక్కనపెడతారని ఎవరు కూడా అంచనా వేయలేదు. టీ20ల‌ల్లో తనంతట తానే కెప్టెన్సీ బాధ్యత నుండి తప్పుకున్న కోహ్లీని వన్డే నుండి ఇలా అర్థాంతరంగా తప్పించడంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది.

కోహ్లీ‌ని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంతేకాకుండా టెస్ట్‌ల్లో అజింక్యా రహానే ను తప్పిస్తూ రోహిత్ శర్మనే వైస్ కెప్టెన్‌గా నియమించింది.

రేసులో ఆ ఇద్దరే..

రోహిత్ కెప్టెన్ కావడంతో వైస్ కెప్టెన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వైస్ కెప్టెన్ రేసులో ఇద్దరి పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్. ప్రస్తుతం టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌నే వన్డే వైస్ కెప్టెన్సీ పదవి వరించినట్లు తెలుస్తోంది.

Next Story