‘ఫెదరర్ మరి కొంత కాలం ఆడతాడు’

by  |
‘ఫెదరర్ మరి కొంత కాలం ఆడతాడు’
X

దిశ, స్పోర్ట్స్ : గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ వచ్చే ఏడాది కోర్టులోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఫెదరర్.. కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ తర్వాత గాయం తగ్గినా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాదంతా ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ , ఏటీపీ టూర్ ఫైనల్స్‌కు దూరంగా ఉన్న ఫెదరర్ గాయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తిరిగి కోర్టులోకి అడుగుపెట్టినా మునుపటి ఫామ్‌ను అందుకోలేడని వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై ఫెదదర్ మాజీ కోచ్ స్టెఫాన్ ఎడ్‌బర్గ్ స్పందించారు. ఫెదదర్ దగ్గర ఇంకా టెన్నిస్ ఆడే సామర్థ్యం ఉందని.. గాయం నుంచి కోలుకున్న కోర్టులో మునుపటి ఫామ్ అందుకుంటాడని వ్యాఖ్యానించాడు. 2013లో వెన్నెముక గాయంతో ఫెదరర్ ఇబ్బంది పడ్డాడు. గాయం నుంచి కోలుకున్నాక రెండేళ్ల పాటు స్టెఫాన్ ఎడ్‌బర్గ్ అతడికి వ్యక్తిగత కోచ్‌గా ఉన్నాడు. ఫెదరర్‌ను దగ్గర నుంచి పరిశీలించిన స్టెఫాన్.. ఇలాంటి గాయాలు ఫెదరర్‌కు కొత్తవి కావని.. కెరీర్‌లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా.. 20 గ్రాండ్‌స్లామ్స్ సాధించగలిగాడని గుర్తు చేశారు.


Next Story

Most Viewed