- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి మూడు వైన్ షాపుల్లో చోరీకి యత్నం
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లో బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఆర్మూర్ రోడ్డులోని అశోకా వైన్స్ షట్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ షాప్ వాచ్‌మెన్ గమనించి కేకేలు వేయడంతో పరారయ్యారు. అలాగే, బైపాస్ రోడ్డులోని శ్రీ సాయిప్రభ లిక్కర్ మార్ట్, మహా దుర్గా వైన్స్ షాపుల్లోనూ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ విధంగా ఒకే రోజు మూడు వైన్ షాపుల్లో దొంగతనాలకు యత్నించడం […]</p>

X
దిశ, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లో బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఆర్మూర్ రోడ్డులోని అశోకా వైన్స్ షట్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ షాప్ వాచ్‌మెన్ గమనించి కేకేలు వేయడంతో పరారయ్యారు. అలాగే, బైపాస్ రోడ్డులోని శ్రీ సాయిప్రభ లిక్కర్ మార్ట్, మహా దుర్గా వైన్స్ షాపుల్లోనూ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ విధంగా ఒకే రోజు మూడు వైన్ షాపుల్లో దొంగతనాలకు యత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత వైన్ షాపుల యజమానులు సిండికేట్ అయ్యారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఘటనలపై వైన్ షాపుల యజమానులు ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.
Tags: wine shop, robbery attempt, nizamabad, ts news
Next Story






