- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొందుర్గుకు వెళ్లే రహదారులన్నీ నాకాబంది
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పథకం పూర్తి చేయాలన్న డిమాండుతో మంగళవారం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్క రోజు జలదీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ వర్గాలతో ముందుకు సాగేందుకు ప్రణాళిక చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని […]</p>

X
దిశ, రంగారెడ్డి: దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పథకం పూర్తి చేయాలన్న డిమాండుతో మంగళవారం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్క రోజు జలదీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ వర్గాలతో ముందుకు సాగేందుకు ప్రణాళిక చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని నిలువరించేందుకు పోలీసులు వెంబడిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లక్ష్మీదేవిపల్లికి పోకుండా రహదారులన్నీ దగ్బంధం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపిస్తున్నారు.
Next Story






