రోడ్లకు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టండి : ఎర్రబెల్లి

by  |
Errabelli
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ‌ర్షాల‌కు దెబ్బతిన్న పంచాయ‌తీరాజ్ శాఖ రోడ్లకు వెంట‌నే మ‌ర‌మ్మతులు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాస స‌ముదాయంలోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో పంచాయ‌తీరాజ్ శాఖ‌లోని ప‌లు అంశాలపై ఉన్నతాధికారుల‌తో బుధ‌వారం స‌మీక్ష నిర్వహించారు. పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగంలోని ప‌దోన్నతులు, పోస్టింగులు, ఇటీవ‌ల ప‌దోన్నతులు పొందిన డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు, కారోబార్‌లు, పంపు మెకానిక్‌ల స‌మ‌స్యలపై మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మ‌ర‌మ్మతులు వెంట‌నే చేప‌ట్టాల‌న్నారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న వాటిని పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ప‌దోన్నతులు పొందిన‌ 57మంది డీపీఓలు, ఎంపీడీఓలకు ఖాళీల‌ను బ‌ట్టి పోస్టింగులు ఇవ్వాల‌ని ఆదేశించారు. అలాగే ఇంజ‌నీరింగ్ విభాగంలోని ఇంజ‌నీర్లకు ప‌దోన్నతులు క‌ల్పించాల‌ని, ఇందుకు సంబంధించిన నివేదిక‌లు సిద్ధం చేయాల‌న్నారు. కారోబార్‌లు, పంపు మెకానిక్‌‌లు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్యల‌ను ప‌రిశీలించి, నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వెంట‌నే ప‌రిష్కరించాల‌న్నారు. వైకుంఠ దామాలు, డింపింగ్ యార్డుల‌ను సాధ్యమైనంత తొంద‌ర‌గా పూర్తయ్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఇంజ‌నీర్ ఇన్ చీఫ్‌ సంజీవ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed