- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం జరిగిందని కారు స్లో చేసుకుంటే.. వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది
by Shyam |
<p>దిశ, నల్లగొండ: రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి తన కారును స్లో చేసుకున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ కారును ఢీకొట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రెండు కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారు ఆ కార్లను పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి […]</p>

X
దిశ, నల్లగొండ: రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి తన కారును స్లో చేసుకున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ కారును ఢీకొట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రెండు కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారు ఆ కార్లను పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి తన కారు వేగం తగ్గించాడు. కానీ, ఆ కారు వెనుక వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఫల్టీలు కొట్టింది. కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలావుంటే.. ఈ ప్రాంతంలోనే సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు.
Next Story






