ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. నుజ్జునుజ్జైన బస్సు

by Batti.Sumithra |

<p>దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం శాయంపేట మండ‌లం మందారిపేట శివారులో ఆర్టీసీ బ‌స్సును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తుండ‌గా ఈ దారుణ ఘటన చోటుచేసకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. [&hellip;]</p>

Road Accident
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం శాయంపేట మండ‌లం మందారిపేట శివారులో ఆర్టీసీ బ‌స్సును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తుండ‌గా ఈ దారుణ ఘటన చోటుచేసకుంది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు తెలిపారు.

Next Story