- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ నలుగురు స్పాట్‌డెడ్.. కారణం అదే!
<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, మనోజ్ మిట్టల్, రేఖ, మహబూబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, మనోజ్ మిట్టల్, రేఖ, మహబూబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఉన్న నలుగురు మృతి చెందడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
Next Story






