- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిదెవరు..?
<p>దిశ, హసన్ పర్తి: రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకొంది. హసన్ పర్తి మండలం పెద్ద చెరువు(మినీ ట్యాంక్ బండ్)సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తిని ఒక వాహనం ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం స్థానిక 66వ డివిజన్ కార్పోరేటర్ గురుమూర్తి శివ కుమార్ సహకారంతో మున్సిపల్ సిబ్బంది మృతి […]</p>

X
దిశ, హసన్ పర్తి: రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకొంది. హసన్ పర్తి మండలం పెద్ద చెరువు(మినీ ట్యాంక్ బండ్)సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తిని ఒక వాహనం ఢీకొంది. దీంతో సంఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం స్థానిక 66వ డివిజన్ కార్పోరేటర్ గురుమూర్తి శివ కుమార్ సహకారంతో మున్సిపల్ సిబ్బంది మృతి చెందిన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Next Story






