ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. డ్రైవర్‌ను జేసీబీతో బయటకు తీశారు

103

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కోదాడ క్రాస్‌ రోడ్ వద్ద యాక్సిడెంట్ అయింది. కోదాడ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 5గురికి తీవ్రగాయాలు కాగా.. మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ బస్సు-లారీ మధ్యలో చిక్కుకుపోయారు. దీంతో జేసీబీ సాయంతో ఆయన్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించడం గమనార్హం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..