- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొత్తలపాలెం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఒకరు మృతి
<p>దిశ, దామరచర్ల: మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను లారీ వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వేములపల్లి మండలం గండ్రోనిగూడెం నుంచి పిడుగురాళ్లకు ఇటుకల లోడ్ తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బొత్తలపాలెం గ్రామానికి చెందిన మిడతపల్లి నాగరాజు(19)గా పోలీసులు గుర్తించారు. […]</p>

దిశ, దామరచర్ల: మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను లారీ వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వేములపల్లి మండలం గండ్రోనిగూడెం నుంచి పిడుగురాళ్లకు ఇటుకల లోడ్ తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు బొత్తలపాలెం గ్రామానికి చెందిన మిడతపల్లి నాగరాజు(19)గా పోలీసులు గుర్తించారు. మృతుడు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బొత్తలపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






