చుట్టపు చూపుగా వచ్చి అదృశ్యమైన ఆర్ఎంపీ వైద్యుడు

101

దిశ, కుత్బుల్లాపూర్ : చుట్టపు చూపుగా వచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు అనుకోకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. సీఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ కుమార్(27) ఐదు రోజుల కిందట బాచుపల్లిలో ఉండే తమ్ముడు ఉదయ్ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు.

ఈనెల 10వ తేదీన తిరుగు ప్రయాణం కోసం బాచుపల్లిలో బస్సు ఎక్కాడు. ఆ రోజు రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..