- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్కోటిక్స్ విచారణలో రియా సంచలన విషయాలు…..
<p>దిశ వెబ్ డెస్క్: నార్కోటిక్ అధికారుల విచారణలో రియా చక్రవర్తి సంచలన విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. కాగా డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ అధికారులు ఆదివారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను మరో సారి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని నార్కోటిక్స్ అధికారులు భావించారు. అందుకే ఆమెను సోమవారం కూడా విచారించారు. కాగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎన్సీబీ […]</p>

దిశ వెబ్ డెస్క్: నార్కోటిక్ అధికారుల విచారణలో రియా చక్రవర్తి సంచలన విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. కాగా డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ అధికారులు ఆదివారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను మరో సారి విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని నార్కోటిక్స్ అధికారులు భావించారు. అందుకే ఆమెను సోమవారం కూడా విచారించారు.
కాగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎన్సీబీ విచారణలో రియా ఇప్పటికే ఒప్పుకున్నారు. కేధార్ నాథ్ షూటింగ్ సమయంలో సుశాంత్, తన స్టాఫ్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆమె చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుశాంత్ చెప్పినందుకే తాను వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చాట్ చేసినట్టు రియా చెప్పారని తెలుస్తోంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునే విషయం ఎవరికీ తెలియదనీ, అతని స్టాఫ్ మెంబర్స్ ద్వారా అవి డెలివరీ అవుతుంటాయని రియా చెప్పినట్టు సమాచారం.






