సుశాంత్.. మై హీరో : రియా

by  |
సుశాంత్.. మై హీరో : రియా
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్.. రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సుశాంత్ మరణం వెనకున్న రహస్యాన్ని తెలుసుకునేందుకు సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేసిన రియా.. జులై 24 రాత్రి. 7:30 నిమిషాలకు సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కానుండటంతో సోషల్ మీడియాలో ఉద్వేగభరితమైన పోస్ట్ చేసింది.

‘సుశాంత్ నిన్ను చూసేందుకు నాలోని బలాన్ని పూర్తిగా వినియోగిస్తాను.. నువు నాతో ఇక్కడే ఉన్నావని, ఉంటావని తెలుసు. నిన్ను, నీ ప్రేమను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాను. నా జీవితానికి హీరో అయిన నువ్వు.. మా అందరితో పాటు ఈ సినిమాను కలిసి చూస్తానని నమ్ముతున్నా’ అని తెలిపింది రియా.

రియా పోస్ట్‌కు సెలెబ్రిటీలు పాజిటివ్ రియాక్షన్‌తో మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించగా.. సుశాంత్ అభిమానులు మాత్రం నెగెటివ్ రియాక్షన్‌తో నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి నాటకాలు ఆపమని హెచ్చరిస్తున్నారు. ‘మహేష్ భట్‌తో కలిసి చూడు.. మరింత స్ట్రాంగ్ అవుతావ్’ అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఫేక్ లవ్ పోస్ట్‌లు పెట్టి.. రెండు మూడు నెలలు గడిస్తే మరో హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతావని మండిపడుతున్నారు ఫ్యాన్స్.

https://www.instagram.com/p/CDBHe9SH_Md/?igshid=1hkfg7002dizn

Next Story

Most Viewed