వకీల్ సాబ్ వసూళ్లే పవన్ ను ఈ స్థితికి తీసుకొచ్చాయి : ఆర్జీవీ

by  |
వకీల్ సాబ్ వసూళ్లే పవన్ ను ఈ స్థితికి తీసుకొచ్చాయి : ఆర్జీవీ
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వకీల్ సాబ్ వసూళ్లే పవన్ ను ఈ స్థితికి తీసుకొచ్చాయంటూ సెటైర్ వేశాడు. సోషల్ మీడియాలోని పవన్ కళ్యాణ్ ఫోటోలో ఓ చిన్న తప్పుందని ఎవరైనా దాన్ని గుర్తిస్తే , గుర్తించిన వారి ఫోటోను తాను పోస్టు చేసి రివార్డు కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు. అయినా కనిపించని పురుగు పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయస్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్ అని ప్రశ్నించాడు. మరో ట్వీట్‌లో.. వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కలసి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు.


Next Story

Most Viewed