డేలో సైట్స్, నైట్ ఫన్‌ కోరుకుంటారు.. కానీ, ఈయనేంటి?

by  |
డేలో సైట్స్, నైట్ ఫన్‌ కోరుకుంటారు.. కానీ, ఈయనేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. మొన్నకు మొన్న ట్రంప్‌కు భారత్‌లో 10 మిలియన్ల మంది ఆహ్వానం పలకాలంటే ఇండియన్ సినిమా స్టార్స్ ఆయన పక్కన నిల్చుంటేనే సాధ్యం అవుతుందన్న వర్మ… ట్రంప్‌కు వెల్‌కం చెప్పేందుకు భారత్ వేలకోట్లు ఖర్చు చేయడం శోచనీయం అంటూ ట్వీట్ చేశారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు అమెరికన్లు కనీసం వేలల్లో అయినా ఖర్చు పెడతారా? అని ప్రశ్నించాడు. కోట్లు ఖర్చు చేసి విదేశీయ ప్రముఖులను ఆహ్వానించడాన్ని అమెరికా ఎప్పుడో మానేసిందని, కానీ మన బానిస సంస్కృతి మనల్ని అలా ఎప్పటికీ చేయనివ్వదన్నాడు వర్మ.

ట్రంప్ భారత్ పర్యటన వెనుక అసలు కారణం.. అతను చనిపోయేలోపు గొప్పగా చెప్పుకునే ఒక మీటింగ్, తనకు ఇన్ని కోట్ల మంది ఆహ్వానం పలికారని చెప్పుకునే ఒక పర్యటన ఉండాలనే అని విమర్శించారు. ఒక వేళ ట్రంప్ కోసం 10 మిలియన్ల మంది వస్తే.. అతను నా కోసం 15 మిలియన్ల మంది వచ్చారని అబద్ధం చెప్పగలడు అన్నాడు ఆర్జీవి.

మన దేశ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ట్రంప్ మొహం చూడాలని ఆరాటపడుతున్నానని… మన కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తే ఆయనకు చచ్చేంత బోర్ కొడుతుందన్న రామ్ గోపాల్ వర్మ… ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు డేలో అక్కడి సైట్స్ చూసేందుకు ఇష్టపడతారు.. రాత్రి ఫన్ టైం కోరుకుంటారు.. కానీ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపరన్నారు. అందుకే కల్చరల్ ప్రోగ్రామ్‌కు బదులుగా బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు ఇచ్చాడు వర్మ.

Read also..

ఇందూరు ‘కారు’లో సెగలు, పొగలు

Next Story

Most Viewed