అబద్ధాలు మాట్లాడితే పాపులర్ కాలేరు: MLC జీవన్ రెడ్డి ఫైర్

by Satheesh |
అబద్ధాలు మాట్లాడితే పాపులర్ కాలేరు: MLC జీవన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అబద్దాలు మాట్లాడితే పాపులర్ లీడర్లు కాలేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు ఆదరిస్తారన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మహేశ్వర రెడ్డికి ఇంత బుద్ది వచ్చిందా..? అంటూ ప్రశ్నించారు. ఆ పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళ తప్పులు ఒప్పులుగా మారాయా..? అంటూ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడుతా, పేపర్లో పేరు వస్తే చాలు అని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నాడని మండిపడ్డారు. తడిచిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రం కారణం కాదా..? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధాన్యం యావరేజ్ ధర రూ. 1700 మాత్రమే, ఉండగా, ఇప్పుడు 2022కు చేరుకున్నదన్నారు. మిల్లర్లు చేస్తున్న తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా..? అని ధ్వజమెత్తారు. మిల్లర్ల విషయంలో ఇప్పటికే చాలా మార్పులు తెచ్చామని, త్వరలోనే మరిన్ని మార్పులు తీసుకువస్తామన్నారు. 5 సంవత్సరాల్లో కేసీఆర్ రుణమాఫీ చేయలేదని, కానీ తాము ఐదు నెలల్లో చేయబోతున్నామని ప్రకటించారు.

Next Story

Most Viewed