జూన్ 4న రిజల్ట్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు

by srinivas |
జూన్ 4న రిజల్ట్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అదే రోజు పోలింగ్ జరిగింది. రాష్టవ్యాప్తంగా ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగింది. దీంతో పలుచోట్ల అల్లర్లు చెలరేగాయి. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ నిర్ణయంతో పల్నాడు జిల్లాలో ఏకంగా 8 మంది స్పెషల్ అఫీసర్లు భద్రత పర్యవేక్షించనున్నారు. పల్నాడు, మాచర్ల, అనంతపురం, సత్తెనపల్లి, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి వంటి ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అలర్లకు పాల్పడాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ గుప్తా హెచ్చరించారు.

Next Story

Most Viewed