Ram Gopal Varma (RGV) : షాకింగ్ కామెంట్స్.. ఆ ముద్దులేంటి..? ఆ హీరోయిన్ ని అరెస్ట్ చేయాలి!

by  |
Ram Gopal Varma (RGV) :  షాకింగ్ కామెంట్స్.. ఆ ముద్దులేంటి..? ఆ హీరోయిన్ ని అరెస్ట్ చేయాలి!
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోపం వచ్చింది. తెలుగుతెరకు తానే స్వయంగా పరిచయం చేసిన అప్సర రాణిపై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిభను గుర్తించి సోషల్ మీడియా వేదికగా పనిగట్టుకుని ప్రమోట్ చేసే వర్మ గతకొన్ని రోజులుగా అప్సర ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఆమె అందాలను వర్ణిస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ ఫోటో షూట్ లతో.. పబ్బుల్లో షికార్లతో కుర్రాళ్ల గుండెల్లో కాకలు పుట్టిస్తున్న ఈ భామ ఒక కుక్క హృదయాన్ని గాయపరిచినట్లు వర్మ ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అప్సర రాణి తన పెట్ డాగ్ ని ఏడిపించడానికి కుక్క బొమ్మకు ముద్దులు పెడుతూ కనిపించింది. ఇక ఒరిజినల్ డాగ్ తనకు ముద్దులు పెట్టమంటూ అప్సర కాళ్లవెనక తిరుగుతూ కనిపించింది. అయినా తన రియల్ పప్పీని ఇంకా ఉడికిస్తూ దాన్ని అస్సలు పట్టించుకోని అప్సర డాల్ కి ముద్దులు పెడుతూ ఆడుకొంటుంది. ఇక ఈ వీడియోను షేర్ చేసిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆ కుక్క హృదయాన్ని గాయపరిచిన అప్సరను అరెస్ట్ చేయాలి! ఆ పప్పీకి ముద్దుపెడుతుంటే రియల్ పప్పీ ఎంత జెలస్ ఫీలవుతోందో” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ కుక్క బొమ్మ ప్లేస్ లో నువ్వు లేవనేగా ఇదంతా.. అని కొందరు.అమ్మాయిల గురించి కాకుండా కుక్కల మనోభావాలను కూడా గుర్తిస్తున్నావా వర్మ అని మరికొందరు వర్మను ఆడేసుకొంటున్నారు.

ఇకపోతే వర్మ దర్శకత్వంలో అప్సర ‘డేంజరస్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘క్రాక్’ చిత్రంలో ఐటెం సాంగ్ తో పాపులర్ అయిన ఈ భామ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా మారిపోయింది. ఏదిఏమైనా వర్మ ప్రమోషన్ వలనే అమ్మడు ఈ స్థాయికి వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

https://twitter.com/RGVzoomin/status/1438905416222609411?s=20


Next Story