మా ఆత్మగౌరవానికి దెబ్బ..

by  |
మా ఆత్మగౌరవానికి దెబ్బ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో పోస్టులు రద్దు చేసి నాలుగు నెలలైందని, తమను త్రిశంకు స్వర్గంలో రిజర్వుగా ఉంచారని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పి.సతీష్​లు​ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం టీఎన్జీఓ భవన్​లో ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీఆర్వోలను సర్దు బాటు చేయడం లేదని, ప్రమోషన్లు, సీనియారిటీని ఏ విధంగా పొందుపరుస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. తమ ఆవేదనను వినకుండా మాతో చర్చలు జరపకుండా, మాకు, మా కుటుంబాలకు ఆత్మగౌరవం దెబ్బతినే విదంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుందన్నారు.

వీఆర్వో వ్యవస్థ రద్దు అయ్యే ముందు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకొని మా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి టీఎన్జీఓ భవన్ లో ఉద్యోగ జేఏసీ నాయకులతో భేటీ అయినట్లు చెప్నారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్ తో వీఆర్వోల భవిష్యత్తు గురించి చర్చలు జరిపినట్లు చెప్పారు. అతి త్వరలో ఉద్యోగ జేఏసీ, రెవెన్యూ సంఘ నాయకుల ద్వారా ముఖ్యమంత్రిని కలిసి వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సీనియారిటీ, ప్రమోషన్లు వెంటనే కల్పించాలని కోరినట్లు తెలిపారు. వచ్చే నెలలో వీఆర్వోల ఆత్మగౌరవ మహాసభకు రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు హాజరవుతారన్నారు. మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్​లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.


Next Story