- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రాకతో కాంగ్రెస్‌లోకి కీలక నేత
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ రాజకీయాల్లో సెగ పుట్టిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు, టీటీడీపీ నేతలు రేవంత్ వెంట నడిచేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో చాలా మంది నేతలు పార్టీని విడిచారు. ఇక రేవంత్ రాకతో మళ్లీ అదే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత బోడ జనార్దన్ కూడా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీ […]</p>

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ రాజకీయాల్లో సెగ పుట్టిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్‌ను వీడిన నేతలు, టీటీడీపీ నేతలు రేవంత్ వెంట నడిచేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో చాలా మంది నేతలు పార్టీని విడిచారు. ఇక రేవంత్ రాకతో మళ్లీ అదే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత బోడ జనార్దన్ కూడా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు.
ఎవరీ బోడ జనార్దన్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరఫున మంచి గుర్తింపు తెచ్చుకున్న బోడ జనార్దన్ చెన్నూరు నుంచి వరుసగా నాలుగు సార్లు(1985, 1989, 1994, 1999) ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ కెబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచే పోటీ చేసిన జనార్దాన్ తొలిసారిగా గడ్డం వినోద్ చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత టీడీపీ-టీఆర్ఎస్, ఇతర పార్టీలను కలుపుకొని 2009లో మహకూటమి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా టికెట్ టీఆర్ఎస్‌కు వెళ్లడంతో ఆయన డ్రాప్ అయ్యారు.
రేవంత్‌తో కలిసి కాంగ్రెస్‌లోకి..
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ బలహీనపడడం, కీలక నేతలు పార్టీ మారడంతో.. రేవంత్ రెడ్డి, బోడ జనార్దన్ 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదే సంవత్సరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ఆశించినా.. అనూహ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బోరకుంట వెంకటేశ్‌కు అవకాశం ఇచ్చింది. ఈ అసంతృప్తితోనే బోడ జనార్దన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
ఇదే సమయంలో మాజీ ఎంపీ వివేక్ కూడా కమలం పార్టీలో చేరడంతో ఆ ప్రభావం జనార్దన్‌పై పడింది. పార్టీలో వివేక్ క్రీయాశీలకంగా మారడంతో.. ఇరువురి మధ్య మనస్పర్థాలు వచ్చాయి. ఇక మీదట కూడా బీజేపీలోనే కొనసాగితే.. 2023 చెన్నూరు అసెంబ్లీ, పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్న డైలమాలో పడ్డారు. ఈ క్రమంలోనే జూన్ 3న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు మంచిర్యాలలోని బోడ జనార్దన్ నివాసంలో జరిగిన భేటీలో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్టు సమాచారం.
మళ్లీ పాత దోస్తానా..
తెలంగాణ టీపీసీసీగా రేవంత్ నియామకం బోడ జనార్దన్‌కు పార్టీ మారేందుకు కలిసొచ్చింది. గతంలోనూ వీరిద్దరు కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన విషయం తెలిసిందే. దీనికితోడు బీజేపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న ఆయన రేవంత్‌తో సంప్రదింపులు చేసినట్టు స్వయంగా చెప్పారు. అతి త్వరలోనే పార్టీ మారే విషయంపై క్లారిటీ ఇస్తానంటున్నారు. ఆయనతో పాటు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బోడ అనుచరులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌లోకి వస్తే ఆ రెండు స్థానాల్లో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిలదొక్కుకోవాలని భావిస్తున్న బోడ జనార్దన్ కాంగ్రెస్‌లో చేరితే.. సొంత నియోజకవర్గం అయిన చెన్నూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికితోడు పెద్దపల్లి నుంచి ఎంపీగా కూడా బరిలోకి దిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం చెన్నూరులో కాంగ్రెస్ తరఫున బలమైన నాయకుడు ఎవరూ లేకపోవడంతో.. బోడ జనార్దన్‌కు ప్లస్ పాయింట్ అయింది. ఇక ఆయన పార్టీ మార్పు నేడో-రేపో అన్నట్టుగానే మారింది.






