- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం!
<p>దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి ఊహించిన దానికంటే భారీగా పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో నమోదైన 5.03 శాతం కంటే ఇది ఎక్కువగా నమోదైనట్టు కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణ అధికంగా పెరగడం వల్లే సీపీఐ ద్రవ్యోల్బణం గతం కంటే ఎక్కువగా నమోదైనట్టు ఎన్ఎస్ఓ అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.87 శాతంగా నమోదవగా, మార్చిలో ఇది 4.94 శాతానికి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి ఊహించిన దానికంటే భారీగా పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో నమోదైన 5.03 శాతం కంటే ఇది ఎక్కువగా నమోదైనట్టు కేంద్ర గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణ అధికంగా పెరగడం వల్లే సీపీఐ ద్రవ్యోల్బణం గతం కంటే ఎక్కువగా నమోదైనట్టు ఎన్ఎస్ఓ అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.87 శాతంగా నమోదవగా, మార్చిలో ఇది 4.94 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 4.83 శాతం తగ్గాయి. తృణ ధాన్యాలు 0.69 శాతం తగ్గాయి. ‘నూనెలు-కొవ్వులు’ ధరలు అధికంగా 20.78 శాతం నుంచి 24.92 శాతానికి పెరిగాయి. మాంసం, చేపలు 15.09 శాతం, పప్పు ధాన్యాలు 13.25 శతం, గుడ్లు 10.6 శాతం, పండ్లు 7.86 శాతం, పాలు, పాల ఉత్పత్తులు 2.24 శాతం పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం 4.50 శాతం ఉండగా, ఆరోగ్య సేవల ద్రవ్యోల్బణం 6.17 శాతం నమోదైంది.






